బిజెపిలో జాయిన్ అయిన మధుర శ్రీధర్

Madhura-Sreedhar
తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం ఉన్న దర్శకుడు మరియు నిర్మాత మధుర శ్రీధర్ భారతీజ జనతా పార్టీలో చేరాడు. బిజెపి వారు నిన్న నిర్వహించిన మెంబర్ షిప్ సభ్యత్వ కార్యక్రమంలో పాల్గొని బిజెపిలో సభ్యత్వాన్ని పొందాడు. అలాగే తనకు ప్రజలకు సేవ చేయాలని ఉందని, తెలంగాణలో ఓ ప్రాంతం నుండి మంత్రి అవ్వాలని ఉందని తెలిపాడు.

ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా కెరీర్ ప్రారంభించిన మధుర శ్రీధర్ ఆ తర్వాత సినిమాల మీద ఉన్న మక్కువతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టాడు. ‘స్నేహగీతం’ సినిమాతో మధుర శ్రీధర్ రచయిత – దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ఆయన దర్శకుద్గానే కాకుండా నిర్మాతగా కూడా మారి సినిమాలను నిర్మించాడు. మధుర శ్రీధర్ నిర్మించిన ప్రేమ ఇష్క్ కాదల్ , మాయ సినిమాలు ప్రేక్షకుల మన్ననలు పొందాయి. మధుర శ్రీధర్ నిర్మించిన లేడీస్ అండ్ జెంటిల్ మెన్ సినిమా విడుదలకి సిద్దమవుతోంది. ఈ మూవీ ఆడియో నవంబర్ 24న రిలీజ్ కానుంది.

Exit mobile version