ఈ వారం థియేటర్స్ లో విడుదల కావాల్సి ఉన్న పలు చిత్రాల్లో కోలీవుడ్ నుంచి డబ్బింగ్ అయి వస్తున్న అవైటెడ్ సినిమా ఎల్ ఐ కే (లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ) కూడా ఒకటి. యువ హీరో హీరోయిన్స్ ప్రదీప్ రంగనాథన్ అలాగే కృతి శెట్టిలు జంటగా విగ్నేష్ శివన్ తెరకెక్కించిన ఈ ఫ్యూచరిస్టిక్ సినిమాపై ఒకప్పుడు మంచి బజ్ ఉంది.
కానీ అలా ఆలస్యం అవుతున్న కొద్దీ ఇప్పుడు ప్రదీప్ నే తన సినిమా పెర్ఫార్మన్స్ విషయంలో డౌట్ పడుతున్నాడు. ఈ సినిమా నిజానికి తన కెరీర్ రెండో సినిమాగా రావాల్సిన సినిమా అట. అంటే ఎప్పటిదో అర్ధం చేసుకోవచ్చు. అలానే దీనికి ముందు వచ్చిన సినిమాలు అన్నీ 100 కోట్లు గ్రాస్ రాబట్టయి. దీనితో ఆ ప్రెజర్ కూడా ఈ సినిమా బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ పై ఉందని ప్రదీప్ చెప్పకనే చెప్పాడు.
సో ఎప్పుడో రావాల్సిన ఈ సినిమా ఓ పక్క తనకి హిట్ గా నిలుస్తుందా? 100 కోట్లు రాబడుతుందా అనేవి తనకి పెద్ద ఛాలెంజ్ గానే ఉన్నాయని చెప్పొచ్చు. సో వీటిని యంగ్ హీరో అధిగమిస్తాడో లేదో అనేది ఇంకొన్ని రోజుల్లో తెలిసిపోతుంది.
