మంచి వార్తని తెలపనున్న మోహన్ బాబు

mohan-babu
నటుడు మోహన్ బాబు ట్విట్టర్లో రేపు ఒక మంచి వార్త పోస్ట్ చేయనున్నారని తన అభిమానులకి ట్వీట్ చేసారు. ” నా అభిమానులకు శ్రేయోభిలాషులకి నేను రేపు ఒక అద్బుతమైన వార్తని రేపు మధ్యానం మీ అందరితో పంచుకుంటాను. ఇది నా జీవితంలో చాలా ముఖ్యమైన విషయం” అని మోహన్ బాబు ట్వీట్ చేసారు.

ఈ వార్తని ఎంతోమంది మనోజ్ పెళ్లి వార్తని అనుకుంటున్నారు. అయితే మనోజ్ వెంటనే తను అప్పుడే పెళ్లి చేసుకోవటంలేదని అంతకన్న మంచి వార్త తన తండ్రి రేపు వెల్లడిస్తారని అన్నారు. “గైస్ ఆ వార్త న పెళ్లి గురించి కాదు దానికి ఇంకా చాలా సమయం వుంది. మేము చెప్పబోతున్న విషయం అంతకన్నా మంచిది పెద్దది” అని మనోజ్ ట్వీట్ చేసాడు.

ప్రస్తుతానికి ఆ వార్త ఏమిటన్నది ఎవరికి తెలీదు. ఆ వార్త రేపు తెలుస్తుంది. ఆ వార్త అందరిని ఆశ్చర్య పరుస్తుందని ఆశిద్దాం.

Exit mobile version