సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మహర్షి’ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. అయితే ఈ షూటింగ్ కి సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హాల్ చల్ చేస్తోంది.
అసలు విషయంలోకి వెళ్తే.. 8 కోట్ల ఖర్చు పెట్టి ఈ షూటింగ్ కోసం ఓ భారీ విలేజ్ సెట్ వేశారట. విలేజ్ నేపథ్యంలో సాగే సన్నివేశాలు సినిమాలోనే చాలా కీలకం అని తెలుస్తోంది. ఆ సన్నివేశాలనే ప్రస్తుతం చిత్రబృందం చిత్రీకరిస్తోంది.
ఇక ఈ సినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. ప్రముఖ కామెడీ హీరో అల్లరి నరేష్ కూడా ఈ చిత్రంలో ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాడు. కాగా ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, అశ్వినీదత్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
