హైద్రాబాద్లో మహావీర్ కర్ణ !

Mahaveer

చియాన్ విక్రమ్ నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం మహావీర్ కర్ణ షూటింగ్ హైదరాబాద్ లో ప్రారంభమైంది. ప్రస్తుతం ఈ షెడ్యూల్ లో కురుక్షేత్ర యుద్ధ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. సినిమాలో ఈ యుద్ధం అరగంట పాటు వుంటుందట. మహాభారతం ఆధారంగా తెరక్కుతున్న ఈ చిత్రంలో విక్రమ్ , కర్ణుడిగా నటిస్తున్నారు. ఆర్ ఎస్ విమల్ దర్శకత్వంలో తమిళ , హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం మిగితా భాషల్లోకి కూడా అనువాదం కానుంది.

సుమారు 300 కోట్ల బడ్జెట్ తో యునైటెడ్ ఫిలిం కింగ్ డమ్ నిర్మిస్తున్న ఈచిత్రాన్ని వచ్చే ఈ ఏడాది డిసెంబర్ లో విడుదలచేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక విక్రమ్ నటించిన ‘కడరం కొండన్’ విడుదలకు సిద్దమవుతుంది. హాలీవుడ్ సూపర్ హిట్ చిత్రం ‘డోంట్ బ్రీత్’ కు రీమేక్ గా తెరెకెక్కుతున్న ఈ చిత్రంలో విక్రమ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనునున్నాడు.

Exit mobile version