మహేష్ 25 ఫస్ట్ లుక్ ఆరోజే !

Mahesh Babu

భరత్ అనే నేను చిత్రం తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన 25 వ చిత్రంలో నటిస్తున్నాడు. వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం యొక్క ఫస్ట్ షెడ్యూల్ ఇటీవల డెహ్రాడూన్ లో జరిగింది. ఈ షెడ్యూల్ తరువాత చిత్ర బృందం గోవా వెళ్లనుందని సమాచారం. ఇక ఈచిత్రం యొక్క ఫస్ట్ లుక్ మహేష్ పుట్టిన రోజు సంధర్బంగా ఆగష్టు 9న విడుదలకానుంది. ఈ ఫస్ట్ లుక్ తో అభిమానులకు ఆ రోజు డబుల్ ధమాకా ఇవ్వనున్నారు మహేష్.

దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే కథనాయికగా నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, అశ్విని దత్, పివిపి లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈచిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ప్రేక్షకులముందుకు రానుంది.

Exit mobile version