ఇండస్ట్రీలో డైరెక్టర్స్ హీరోగా సూపర్ స్టార్ మహేష్ కి మంచి పేరుంది. తమ ఇమేజ్ ని పక్కన పెట్టి దర్శకుల కావలసిన విధంగా అవుట్ ఫుట్ ఇవ్వడం మహేష్ నైజం. కాగా మహేష్ ని మల్టీ స్టారర్ పై మీ అభిప్రాయం ఏంటని అడుగగా ఆయన ఆసక్తికర సమాధానం చెప్పారు. మల్టీ స్టారర్ చేయడానికి తనకేమి అభ్యంతరం లేదన్న మహేష్ తన ఇమేజ్ కి తగ్గట్టుగా మంచి కథతో వస్తే మల్టీ స్టారర్ చేయడానికి సిద్ధం అని చెప్పారు. గతంలో మహేష్ విక్టరీ వెంకటేష్ తో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రం చేయడం జరిగింది. ఇద్దరు అన్నదమ్ముల మధ్య ప్రేమ, ఆప్యాయత, బాధ్యత, ఇగో వంటి విషయాలతో తెరకెక్కిన ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది.
ఇక మహేష్ సంక్రాంతి చిత్రం సరిలేరు నీకెవ్వరు ఈనెల 11న విడుదల కానుంది. మహేష్ కి రష్మిక జంటగా నటించిన ఈ చిత్రాన్ని అనిల్ రావిపూడి తెరకెక్కించారు. దిల్ రాజు సమర్పణలో రామ బ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు. విజయశాంతి కీలక రోల్ చేస్తుండగా దేవిశ్రీ సంగీతం అందించారు.
