ప్రమోషన్స్ విషయంలో మహేష్, అల్లు అర్జున్ అసలు తగ్గడం లేదు. మొదటి నుండి రెండు చిత్రాల హీరోలు ఒకరిని మించి ఒకరు ప్రొమోషన్స్ నిర్వహిస్తున్నారు. నిన్న మహేష్ వైబ్ ఆఫ్ సరిలేరు నీకెవ్వరు పేరుతో ఒక మేకింగ్ వీడియో విడుదల చేశారు. దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీనితో నేడు అల వైకుంఠపురలో చిత్రం నుండి మేకింగ్ వీడియో విడుదల చేశారు. ఈ వీడియోలో సినిమా యూనిట్ ఆడుతూ, పాడుతూ, నవ్వుతూ, తుళ్లుతూ ఎంతో సరదా సరదాగా సినిమాను పూర్తి చేసినట్లు కనిపిస్తోంది.
శాస్త్రీయ సంగీతంతో మొదలుపెట్టి..బన్నీ కుమారుడి అల్లరితో ఈ మేకింగ్ వీడియో ముగించారు. ఈ రెండు చిత్రాల దర్శక నిర్మాతలు మరియు హీరోలు చిత్రాల విజయంపై పూర్తి విశ్వాసంతో ఉన్నారు. సంక్రాంతి పండుగ సీజన్లో వస్తున్న సరిలేరు నీకెవ్వరు మరియు అలవైకుంఠపురంలో భారీ ఓపెనింగ్స్ సాధించడం ఖాయం.
