ఇప్పుడు ఇండియన్ సినిమా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అవైటెడ్ భారీ చిత్రాల్లో ఒకటే “వారణాసి” (Varanasi). సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ ని ఇండియన్ సినిమా నుంచి రెండో ఐమ్యాక్స్ సినిమాగా తెస్తున్నారు. అయితే ఈ సినిమా అనౌన్స్ చేసిన వీడియో నుంచి ఓ చర్చ మాత్రం అలా సాగుతుంది.
ఇండియన్ సినిమా నుంచి వరల్డ్ వైడ్ ఆడియెన్స్ కోసం ఐమ్యాక్స్ వెర్షన్ లో సినిమా తీస్తున్నారు సరే కానీ అసలు మన ఇండియన్ సినిమా దగ్గర ఎన్ని ఐమ్యాక్స్ స్క్రీన్స్ ఉన్నాయి? మరీ ముఖ్యంగా మన తెలుగు స్టేట్స్ లో ఎన్ని ఉన్నాయి అనే మాట డెఫినెట్ గా వినిపిస్తూ వచ్చింది. తీస్తున్నదే మనం అలాంటిది మన దగ్గరే అందుకు తగ్గ స్క్రీన్ లేదు..
మరి దీని కోసం మహేష్ బాబు బిగ్ ప్లాన్ చేసినట్టు రూమర్స్ ఇప్పుడు మొదలయ్యాయి. ఈ సినిమా స్క్రీన్స్ నిష్పత్తికి సరిపడా ఐమ్యాక్స్ స్క్రీన్ ని మహేష్ బాబు మన దగ్గర నిర్మిస్తున్నట్టు పలు ఊహాగానాలు ఇప్పుడు మొదలయ్యాయి. దీనిని వారణాసి (Varanasi) రిలీజ్ దానితోనే ఓపెన్ అవుతుంది అని అంటున్నారు. కానీ.. ఇంకా వారణాసి (Varanasi) వచ్చేందుకు ఏడాదిన్నర సమయం మాత్రమే మిగిలి ఉంది. కానీ ఈ తక్కువ సమయంలోనే చాలా తతంగం పూర్తి చేయాల్సి ఉంది. సో అప్పటికి పూర్తయ్యి సినిమా స్క్రీన్ లో పడుతుందా అనేది పెద్ద ప్రశ్న. మరి దీనిపై అసలు క్లారిటీ ఇంకా బయటకి రావాల్సి ఉంది.
