
ముచ్చటగా మూడోసారి పూరి జగన్నాధ్ దర్శకత్వంలో నటించడానికి సూపర్ స్టార్ మహేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఫిల్మ్ నగర్ టాక్. వీరిద్దరి కలయికలో వచ్చిన ‘పోకిరి’, ‘బిజినెస్ మేన్’ సినిమాలు ఘన విజయాలు సాదించాయి. అభిమానులు ఈ కాంబినేషన్ లో తెరకేక్కబోయే హట్రిక్ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. గత సినిమాలలో మహేష్ బాబును సరికొత్త స్టైల్ లో ప్రజెంట్ చేసిన పూరి… ఈ సినిమాలో ఎలా చూపిస్తారో అని ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది.
పూరి జగన్నాధ్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించబోయే ఈ హట్రిక్ సినిమాను అశ్వినిదత్ నిర్మిస్తారని ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం మహేష్ బాబు కొరటాల శివ సినిమాతో, పూరి జగన్నాధ్ ఎన్టీఆర్ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇవి పూర్తయిన తర్వాత కొత్త సినిమా ప్రారంభం అవుతుంది.