నమ్రతకి ఇచ్చిన బాధ్యతలపై మహేష్ బాబు కామెంట్.!

namartha
సూపర్ స్టార్ మహేష్ బాబుకి పుట్టిన రోజు కానుకగా శ్రీమంతుడు అనే సినిమాని బ్లాక్ బస్టర్ చేసారు, అభిమానులు ఇచ్చిన ఈ గిఫ్ట్ విషయంలో మహేష్ బాబు చాలా ఆనందంగా ఉన్నాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద 50 కోట్ల మార్క్ ని క్రాస్ చేసిన ఈ సినిమా కలెక్షన్స్ జారుని సెకండ్ వీకెండ్ లో కూడా కొనసాగిస్తోంది. ఈ సినిమాతో మహేష్ బాబు హీరోగానే కాకుండా జి. మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ద్వారా నిర్మాతగా మారతాడు. మహేష్ బాబు నిర్మాతగా ట్రై చేసిన మొదటి సినిమానే సూపర్ హిట్ గా నిలిచింది.

ఇప్పటికే చాలా ఇంటర్వ్యూలలో నమ్రత శిరోద్కర్ ఈ సినిమా ప్రొడక్షన్, మార్కెటింగ్ మరియు పబ్లిసిటీ విషయంలో తనే స్పెషల్ కేర్ తీసుకుందని ఇదివరకే తెలియజేశారు. ఇప్పుడు ఈ సినిమాకి నమ్రత చేసిన పబ్లిసిటీ చాలా చాలా పెద్ద హెల్ప్ అయ్యింది. తాజా సమాచారం ప్రకారం నమ్రత అడ్వర్టైజింగ్ ప్రొఫెషనల్స్ తో ఓ పబ్లిసిటీ టీంని ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఇకపై మహేష్ అన్ని సినిమాలకు తనే మార్కెటింగ్ చేయనున్నట్లు సమాచారం. రీసెంట్ గా ఈ విషయంపై మహేష్ బాబుని అడిగినప్పుడు ‘తను ఈ సినిమా సక్సెస్ లో చాలా పెద్ద పార్ట్ ప్లే చేసింది. ఇకపైన నా అన్ని సినిమాల విషయంలో కూడా తనని ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వాలని అడుగుదామని’ అనుకుంటున్నానని తెలిపాడు.

Exit mobile version