మహేష్ బాబు ‘బ్రహ్మోత్సవం’ షూటింగ్ అప్డేట్.!

mahesh-babu
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్ లో చేస్తున్న ‘శ్రీ మంతుడు'(వర్కింగ్ టైటిల్) సినిమా షూటింగ్ ని శరవేగంగా ఫినిష్ చేస్తున్నాడు. ఇటీవలే మలేషియా షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర టీం ప్రస్తుతం హైదరాబాద్ లో షూట్ చేస్తోంది. జూన్ రెండవ వారం కల్లా ఈ సినిమా షూటింగ్ ని ఫినిష్ చెయ్యాలని ఈ చిత్ర టీం ప్లాన్ చేస్తోంది. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు శ్రీ కాంత్ అడ్డాల డైరెక్షన్ లో ‘బ్రహ్మోత్సవం’ సినిమా చేయనున్నారు. ఈ సినిమాని కృష్ణ గారి బర్త్ డే కానుకగా మే 31న అధికారికంగా లాంచ్ చేయనున్నారు.

తాజా సమాచారం ప్రకారం శ్రీమంతుడు షూటింగ్ పూర్తి కాగానే ఏ మాత్రం గ్యాప్ లేకుండా మహేష్ బాబు బ్రహ్మోత్సవం సినిమా షూటింగ్ మొదలు పెడతారని అంటున్నారు. జూన్ మూడవ వారం నుంచి విజయవాడలో షూటింగ్ మొదలవుతుందని ఈ చిత్ర వర్గాలు అంటున్నాయి. మహేష్ బాబు కోసం ఈ సారి శ్రీ కాంత్ అడ్డాల విజయవాడ బ్యాక్ డ్రాప్ ని ఎంచుకున్నాడు. పివిపి బ్యానర్ పై పరమ్ వి పొట్లూరి నిర్మించనున్న ఈ సినిమాలో మహేష్ బాబు సరసన ముగ్గురు హీరోయిన్స్ ఉంటారు. అందులో ఒకరుగా రకుల్ ప్రీత్ సింగ్ ని ఎంపిక చేయగా మరో ఇద్దరిని ఎంపిక చేసే పనిలో శ్రీకాంత్ అడ్డాల ఉన్నాడు.

Exit mobile version