ఈ పుట్టినరోజుకి ‘వారణాసి’పై మహేష్ ఏం చెప్తున్నారంటే!

తెలుగు సినిమా దగ్గర ప్రస్తుత జెనరేషన్ లో బిగ్గెస్ట్ స్టార్స్ లో ఒకరైన సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా తన బిగ్ ప్రాజెక్ట్ ‘వారణాసి’ నుంచి వచ్చిన సర్ప్రైజ్ ఫ్యాన్స్ లో ఎగ్జైటింగ్ గా మారింది. ఇక సినీ ప్రముఖులు అనేకమంది మహేష్ బాబుకి తమ బెస్ట్ విషెస్ అందించారు.

అయితే ఈ పుట్టినరోజుకి చూపించిన ప్రేమకు మహేష్ బాబు ముగ్ధుడు అయ్యి అందరికీ తన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపి అభిమానులకి తమని మరింత గర్వించదగేలా పని చేస్తానని ప్రామిస్ చేసాడు.

అంతే కాకుండా తాను ఇప్పుడు చేస్తున్న ఎపిక్ వరల్డ్ సినిమా ‘వారణాసి’ కోసం చెప్తూ ఈ చిత్రం నా హృదయానికి చాలా దగ్గరైన సినిమా, ఇది ఖచ్చితంగా ఒక ప్రత్యేకమైందిగా నిలుస్తుంది అని భావిస్తున్నాను. ఆ ఎక్స్ పీరియన్స్ ని మీకు అందించడానికి ఆగలేకపోతున్నాను అని మహేష్ తెలిపారు. దీనితో తన ప్రెస్ నోట్ ఫ్యాన్స్ వైరల్ గా మారింది.

Exit mobile version