‘శ్రీమంతుడు’ తమిళ ఆడియో రిలీజ్ డేట్!

Srimanthudu
సూపర్ స్టార్ మహేష్ అభిమానులు తమ హీరోను ‘శ్రీమంతుడు’గా ఎప్పుడెప్పుడు చూద్దామా అని చూస్తున్న ఎదురుచూపులకు మరో పది రోజుల్లో తెరపడనుంది. మహేష్-కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘శ్రీమంతుడు’ భారీ అంచనాల మధ్య ఆగష్టు 7న విడుదల కానున్న విషయం తెలిసిందే! మైత్రీ మూవీస్ పతాకంపై నిర్మితమైన ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్‌గా నటించింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. ఇక సినిమా విడుదలకు ఇంకా పది రోజులే ఉండడంతో ఇప్పటికే సోషల్ మీడియాలో ప్రచార కార్యక్రమాలు వేగవంతం చేశారు.

ఇక తమిళంలోనూ తెలుగు రిలీజ్ రోజే ‘సెల్వంద’న్‌గా శ్రీమంతుడు విడుదల కానున్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా మంచి పాపులరిటీ ఉన్న మహేష్ సినిమాలు ఇప్పటివరకూ కొన్ని తమిళంలోనూ డబ్ అవుతూ వచ్చినా అవేవీ నేరుగా తెలుగు వర్షన్ రిలీజ్ రోజే విడుదలవ్వలేదు. కాగా శ్రీమంతుడు తమిళ డబ్బింగ్ వర్షన్ మాత్రం తెలుగు వర్షన్ రిలీజ్ రోజే, అంటే ఆగష్టు 7నే విడుదల కానుంది.

తమిళంలో కూడా ఇప్పటికే ప్రచార కార్యక్రమాలు మొదలుపెట్టేశారు. ఇక జూల 31న చెన్నైలో సెల్వందన్ ఆడియో రిలీజ్ వేడుకను నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. మహేష్ బాబు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారని సమాచారం. తమిళంలోనూ మహేష్‌కు ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా సరైన ప్రమోషన్‌తో వెళితే మంచి కలెక్షన్లు కొల్లగొట్టవచ్చనేది సినిమా యూనిట్ ఆలోచన.

Exit mobile version