
సూపర్ స్టార్ కృష్ణ గారి వారసుడిగా ఆయన నట వారసత్వాన్ని తీసుకొని తన టాలెంట్ తో ఒక్కో స్టెప్ పైకి ఎక్కి కొన్ని కోట్ల ప్రేక్షకుల హృదయాలను గెలుగుకొని తను సూపర్ స్టార్ గా ఎదిగిన హీరో మహేష్ బాబు. ఇప్పటి వరకూ హీరోగానే తెలుగు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ వచ్చిన మహేష్ బాబు ఇప్పుడు కృష్ణ గారిలానే నిర్మాతగా కూడా మారి తన మనసుకు నచ్చిన కథా బలం ఉన్న సినిమాలను తీసి ప్రేక్షకులను మెప్పించాలని అనుకుంటున్నారు. ఇదే విషయాన్ని ఫిల్మ్ నగర్లో అడుగుతుంటే అందరూ అవుననే వార్తలే ఎక్కువ వినిపిస్తున్నాయి.
మహేష్ బాబు సన్నిహితులు చెబుతున్న సమాచారం ప్రకారం మహేష్ బాబు తన సతీమణి నమ్రత శిరోద్కర్ తో కలిసి ఓ సొంత నిర్మాణ సంస్థని ప్రారంభించే పనిలో ఉన్నారు. ఇప్పటికే ప్రొడక్షన్ హౌస్ వ్యూహరచన చివరి దశకు చేరుకుందని, ఈ ప్రొడక్షన్ హౌస్ కి మహేష్ బాబు తన వారసుడు గౌతమ్ పేరు వచ్చేలా ‘గౌతమ్ ప్రొడక్షన్స్’ అనే పేరుని పరిశీలిస్తున్నట్లు సమాచారం. సినిమా సినిమాకి కొత్తదనం చూపడానికి ఎక్కువ ఇష్టపడే మహేష్ బాబు ఈ ఈ సొంత ప్రొడక్షన్ హౌస్ లో కథాబలం ఉన్న ప్రయోగాత్మక సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నాడని సమాచారం. ప్రస్తుతం ఈ ప్రొడక్షన్ హౌస్ చర్చలు చివరి దశలో ఉన్నాయి. ఈ విషయంపై త్వరలోనే అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉంది.