కమర్షియల్ సినిమాని టార్గెట్ చేసిన మహేష్

Mahesh Babu

ఎన్ని జానర్లు ఉన్నా కమర్షియల్ సినిమాకున్న స్టామినా వేరు. ఈ జానర్లో సినిమా చేసి హిట్ కొడితే వసూళ్లు, స్టార్ డమ్, కెరీర్ గ్రోత్ అన్నీ మూకుమ్మడిగా కలిసొస్తాయి. కలెక్షన్ల పరంగా కొత్త రికార్డులు సృష్టించడం కూడా కమర్షియల్ సినిమాకే సాధ్యం. ఈ సంగతి మహేష్ బాబుకి బాగా తెలుసు. అందుకే ఇకపై కమర్షియల్ సినిమాలనే ఎక్కువగా చేయాలనుకుంటున్నారు ఆయన.

వరుసగా ‘శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి’ లాంటి మెసేజ్ ఒరియెంటెడ్ సినిమాలే చేస్తూ వచ్చిన ఆయన ఈసారి అలాంటివి కాకుండా నూటికి నూరు శాతం కమర్షియల్ ఫార్మాట్లో అంటే ‘దూకుడు, పోకిరి’ తరహాలో సినిమాలు చేయనున్నారు. వంశీ పైడిపల్లితో చేయనున్న నెక్స్ట్ సినిమా ఈ తరహాలోనే ఉంటుందని మహేష్ స్వయంగా అన్నారు. మహేష్ బాబు అభిమానులకు ఇదొక గొప్ప వార్తే అనాలి.

Exit mobile version