
టాలీవుడ్ మోస్ట్ హన్డ్సం హీరో, సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా సినిమాకి వైవిధ్యంలో చూపడంలో ఎప్పుడూ ముందుంటాడు. అలా ఓ డిఫరెంట్ అటెంప్ట్ గా ట్రై చేసిన లేటెస్ట్ మూవీ ‘శ్రీమంతుడు’. మన మూలాలని మరచిపోకూడదు, మనం పుట్టిన ఊరిని గుర్తు పెట్టుకొని, దాని అభివృద్దిలో మనమూ భాగస్వాములం కావాలనే పాయింట్ ని బేస్ చేసుకొని అన్ని కమర్షియల్ అంశాలంతో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద కలెక్షన్స్ పరంగా న్యూ రికార్డ్స్ ని సృష్టిస్తోంది. కలెక్షన్స్ తో పాటు మహేష్ బాబు టాలీవుడ్లో ఏ హీరో క్రియేట్ చెయ్యని ఓ అరుదైన రికార్డ్ ని క్రియేట్ చేసాడు.
ఆ రికార్డ్ విషయంలోకి వెళితే.. మహేష్ బాబు కెరీర్లో ఇప్పటి వరకూ రెండు సినిమలో 50 కోట్ల షేర్ మార్క్ ని క్రాస్ చేసాయి. అవే దూకుడు మరియు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. ఈ రెండు సినిమాల తర్వాత రీసెంట్ గా శ్రీమంతుడు సినిమా కూడా 50 కోట్ల క్లబ్ లో చేరింది. దీంతో మూడు 50 కోట్ల సినిమాలను తన ఖాతాలో వేసుకున్న మొట్ట మొదటి టాలీవుడ్ హీరోగా మహేష్ బాబు రికార్డ్ సృష్టించాడు. ఈ ఎవర్గ్రీన్ రికార్డ్ విషయంలో మహేష్ బాబు అభిమానులు చాలా హ్యాపీ గా ఉన్నారు. కేవలం 5 రోజుల్లోనే 50 కోట్ల మార్క్ క్రాస్ చేసిన శ్రీమంతుడు లాంగ్ రన్ లో ఇంకా ఎక్కువ కలెక్ట్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
మహేష్ బాబు సరసన మొదటిసారి శృతి హాసన్ జోడీ కట్టిన ఈ సినిమాలో జగపతి బాబు, రాజేంద్ర ప్రసాద్, సుకన్య, రాహుల్ రవీంద్రన్ లు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమాతో నిర్మాతలుగా మారిన మైత్రి మూవీ మేకర్స్ వారు శ్రీమంతుడు సక్సెస్ తో చాలా హ్యాపీగా ఉన్నారు.

