తన కొత్త సినిమా గురించి క్లారిటీ ఇచ్చిన మహేష్ !

MaheshBabu

సూపర్ స్టార్ మహేష్ బాబు తన తరువాత సినిమాని కూడా ఇప్పటికే లైన్ లో పెట్టారు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేష్ బాబు తన తరువాత సినిమాని దర్శకుడు వంశీ పైడిపల్లితో చెయ్యబోతున్నట్లు తెలిపారు. అయితే ‘సరిలేర నీకెవ్వరు’ రిలీజ్ తరువాత మూడు నెలలు గ్యాప్ తీసికుంటానని.. ఆ తర్వాత నుండి వంశీ పైడిపల్లితో సినిమాని స్టార్ట్ చేస్తానని మహేష్ చెప్పాడు. ఇక ఇప్పటికే వంశీ పైడిపల్లి స్క్రిప్ట్ వర్క్ కూడా మొదలుపెట్టాడట. ఆల్ రెడీ వంశీ, మహేష్ కి లైన్ చెప్పాడట.

ఇక వీరిద్దరి కాంబినేషన్ లో ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ‘మహర్షి’ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్ల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. పైగా తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం కొన్ని చోట్ల నాన్ బాహుబలి రికార్డు ను కూడా బ్రేక్ చేసింది. పైగా ‘మహర్షి’ ప్రతి ఒక్కరికీ మంచి స్ఫూర్తిదాయకమైన సందేశాన్ని ఇచ్చే సినిమా అని ప్రముఖుల చేత ప్రశంసలు కూడా పొందింది.

Exit mobile version