
గత వారమే సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘ఆగడు’ సినిమా విడుదలై మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. సినిమా రిలీజ్ తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న మహేష్ బాబు తన తదుపరి సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ళడానికి రంగం సిద్దం చేసుకుంటున్నాడు. ఇప్పటికే మహేష్ బాబు కొరత శివ డైరెక్షన్ లో ఓ సినిమాకి కమిట్ అయ్యాడు.
ఆగష్టు 11న లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమా సెప్టెంబర్ చివర్లో సెట్స్ పైకి వెళ్ళాలి కానీ తాజా సమాచారం ప్రకారం కాస్త ఆలస్యంగా సెట్స్ పైకి వెళ్లనుంది. అక్టోబర్ 5 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. అలాగే మార్చి 15 వరకూ కంటిన్యూగా షూటింగ్ చేసి ఈ సినిమాని పూర్తి చేయాలని ఈ చిత్ర టీం ప్లాన్ చేసింది. అలాగే 2015 సమ్మర్ కానుకగా ఈ సినిమాని రిలీజ్ చేయనున్నారు.
మహేష్ బాబు సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని మైత్రి మూవీస్ వారు నిర్మిస్తున్నారు. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించనున్నాడు..