సాలిడ్ సీక్వెన్స్ తో స్టార్ట్ అవ్వనున్న మహేష్ నెక్స్ట్ షూట్.?


ప్రస్తుతం మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన లేటెస్ట్ అవైటెడ్ సినిమా అయినటువంటి “సర్కారు వారి పాట” తో మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత మహేష్ నుంచి క్రేజీ లైనప్ సిద్ధంగా ఉంది. అయితే ఈ లైనప్ లో మహేష్ మొదటగా తన హ్యాట్రిక్ దర్శకుడు త్రివిక్రమ్ తో ఒక భారీ సినిమా చేయనున్నాడు. మరి ఇప్పుడు ఈ సినిమాపై లేటెస్ట్ టాక్ ఒకటి వినిపిస్తుంది.

దీని ప్రకారం అయితే ఈ చిత్రం జూలై నుంచి ఒక సాలిడ్ యాక్షన్ సీక్వెన్స్ తో స్టార్ట్ అవ్వనున్నట్టు తెలుస్తుంది. అలాగే ఈ సీక్వెన్స్ త్రివిక్రమ్ మార్క్ లో మంచి లాజికల్ అండ్ స్టైలిష్ గా ఉంటుందని తెలుస్తుంది. ఆల్రెడీ మహేష్ మరియు త్రివిక్రమ్ ల కాంబోలో వచ్చిన రెండు సినిమాల్లో ఏ రేంజ్ యాక్షన్ సీక్వెన్స్ లు ఉన్నాయో చూసాము. అలాంటిది ఇప్పుడు భారీ పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు మరి దానికి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

Exit mobile version