‘వారణాసి’ని అప్పటికి ముగించేయనున్న సూపర్ స్టార్!?

Varanasi

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ప్రియాంక చోప్రా అలాగే పృథ్వీ రాజ్ సుకుమారన్ ల కలయికలో దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న అవైటెడ్ ఎపిక్ చిత్రం “వారణాసి” (Varanasi) కోసం అందరికీ తెలిసిందే. భారీ హైప్ ని సెట్ చేసుకున్న ఈ సినిమా కోసం మహేష్ బాబు ఎన్నడూ లేని విధంగా కఠినమైన శిక్షణ తీసుకొని ది బెస్ట్ ఇస్తున్నారు.

అయితే ఈ సినిమాని మహేష్ బాబు వచ్చే ఏడాదిలో ముగించేయనున్నారట. 2026 జూన్ నాటికి అలా మహేష్ బాబు తన పోర్షన్స్ మొత్తం కంప్లీట్ చేసేయనున్నారట. మిగతా షూటింగ్ కూడా తర్వాత కంప్లీట్ చేసి మేకర్స్ 2027 మిడ్ కి అలా సినిమా రిలీజ్ ని తీసుకొస్తారని తెలుస్తుంది. మరి దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా శ్రీ దుర్గ ఆర్ట్స్ అలాగే షోయింగ్ బిజినెస్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.

Exit mobile version