చిన్నోడు..పెద్దోడికి హ్యాండ్ ఇచ్చినట్లేనా..?

mahesh venkatesh
కొద్దిరోజుల క్రితం దర్శకుడు సందీప్ వంగా మొదలుపెట్టిన రియల్ మెన్ ఛాలెంజ్ జెట్ స్పీడ్ తో టాలీవుడ్ లో ట్రెండ్ అయ్యింది. దర్శక ధీరుడు రాజమౌళి నుండి చిరంజీవి,వెంకటేష్, చరణ్, ఎన్టీఆర్ లతో పాటు ఇంకా అనేక మంది దర్శక నిర్మాతలు ఈ ఛాలెంజ్ చేసి చూపించారు. ఎన్టీఆర్ చే నామినేట్ చేయబడిన వెంకటేష్ ఛాలెంజ్ పూర్తిచేసి మహేష్ మరియు వరుణ్ లను నామినేట్ చేశాడు. ఐతే ఈ ఇద్దరు కూడా ఈ ఛాలెంజ్ పూర్తి చేయకపోవడం గమనార్హం.

ముఖ్యంగా వెంకటేష్ మహేష్ ని చిన్నోడు అని ముద్దుగా పిలిచి ఛాలెంజ్ పూర్తి చేయాలని సోషల్ మీడియా వేదికగా కోరగా ఆయన స్పందించలేదు. ఇంకొద్దిరోజులలో లాక్ డౌన్ పూర్తి కానున్న నేపథ్యంలో మహేష్ అసలు వెంకీ ఛాలెంజ్ తీరుస్తాడా లేదా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇక వెంకటేష్ ప్రస్తుతం తమిళ హిట్ మూవీ అసురన్ తెలుగు రీమేక్ లో నటిస్తున్నారు. నారప్ప పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కిస్తున్నారు.

Exit mobile version