
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన ‘శ్రీమంతుడు’ సినిమా రిలీజ్ కి ఇంకా కేవలం 9 రోజులు మాత్రమే ఉంది. ఈ చిత్ర ప్రొడక్షన్ టీం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను చివరి దశకు తీసుకు వస్తుంటే, మెయిన్ టీం ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు.. రిలీజ్ దగ్గర పడుతున్న కొద్దీ ఈ సినిమా గురించిన ఆసక్తికర విషయాలు తెలుస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో మహేష్ బాబు టోటల్ గా 7 డిఫరెంట్ గెటప్స్ లో కనిపించి అందరినీ సర్ప్రైజ్ చేయనున్నాడు. ఈ సినిమాలో మహేష్ బాబుకి స్టైలిష్ట్ గా పనిచేసిన అక్షయ్ త్యాగి ఈ విషయాన్ని తెలియజేశాడు.
‘మహేష్ బాబు ఈ సినిమాలోని తన ఎన్నారై లుక్ కోసం 6 వారాల పాటు స్పెషల్ ఫిజికల్ ట్రైనింగ్ తీసుకోవడమే కాకుండా తన లుక్ పరంగా కూడా చాలా డిఫరెంట్ లుక్స్ ట్రై చేసాడు. ఒక్క మాటలో చెప్పాలంటే లేటెస్ట్ ట్రెండ్ అయిన స్కార్ఫ్ కట్టుకోవడం దగ్గర నుంచి మునుపెన్నడూ మహేష్ ట్రై చెయ్యని ధోతి లుక్ వరకూ ఇలా అన్ని ట్రై చేసాడు. కార్పోరేట్ సంస్థ ఓనర్ లుక్, రిచ్ కిడ్ గా, కాలేజ్ స్టూడెంట్ గా, పక్కా మాస్ హీరోగా, అందరినీ సర్ప్రైజ్ చేసే ధోతీ లుక్ ఇలా టోటల్ గా 7 డిఫరెంట్ లుక్స్ లో మహేష్ బాబు కనిపిస్తాడని’ అక్షయ్ త్యాగి తెలిపాడు.
మహేష్ బర్త్ డే కానుకగా ఆగష్టు 7న ఈ సినిమాని రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాని ‘సెల్వందన్’ పేరుతో ఒకేసారి తమిళంలో కూడా రిలీజ్ చేయనున్నారు. మహేష్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి కొరటాల శివ డైరెక్టర్.