మహేష్ ‘మహర్షి’ రిలీజ్ డేట్ పై ఇంట్రస్టింగ్ న్యూస్ !

maharshi

మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మహర్షి’. కాగా ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ముందుగా ఈ సినిమాను ఏప్రిల్ 25వ తేదీన విడుదల చేయాలనుకున్నారు. కానీ ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఎక్కువ సమయం పట్టే అవకాశాలు ఉండటంతో విడుదల తేదీని వెనక్కి జరపాలని చిత్రబృందం ఆలోచిస్తోన్నట్లు తెలుస్తోంది.

ఇక మహర్షిలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. ప్రముఖ కామెడీ హీరో అల్లరి నరేష్ కూడా ఈ చిత్రంలో ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాడు. ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, అశ్వినీదత్ కలిసి నిర్మిస్తున్నారు.

Exit mobile version