ఈ వారంలో పొల్లాచ్చి షెడ్యూల్ కంప్లీట్ చేయనున్న మహేష్ బాబు

mahesh-babu
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతుంది. గత నెల రోజుల నుండి ఈ సినిమా షూటింగ్ పొల్లాచ్చి పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. బాలీవుడ్ స్టంట్ మాస్టర్ అణల్ అరసు నేతృత్వంలో యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. కుటుంబ సన్నివేశాలను కూడా చిత్రీకరించారు. శనివారం నుండి పళనిలో చిత్రీకరణ సాగుతుంది. మార్చి 3 కల్లా ఈ షెడ్యూల్ పూర్తవుతుంది.

శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్, జగపతి బాబు, బ్రహ్మానందం తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. సినిమాకు ‘శ్రీమంతుడు’ అనే టైటిల్ ఖరారు చేసినట్టు ప్రచారంలో ఉంది. నిర్మాతలు అధికారికంగా ప్రకటించలేదు. మైత్రి మూవీస్ పతాకంపై ఈ సినిమా రూపొందుతుంది. యలమంచిలి రవి శంకర్, సివి మోహన్, ఎర్నేని నవీన్ నిర్మాతలు. దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. వేసవిలో సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

Exit mobile version