మూవీ లవర్స్ కి మహేష్ బాబు సూచన.!

మూవీ లవర్స్ కి మహేష్ బాబు సూచన.!

Published on Aug 12, 2015 10:32 AM IST

Mahesh-Babu
టాలీవుడ్ లేటెస్ట్ రిలీజ్ అయిన ‘శ్రీమంతుడు’ సినిమా సూపర్ పాజిటివ్ మౌత్ టాక్ తో సూపర్ హిట్ అయ్యింది. కేవలం సూపర్ హిట్ టాక్ మాత్రమే కాదు బాక్స్ ఆఫీసు వద్ద కూడా కాసుల వర్షం కురిపిస్తూ రికార్డ్ కలెక్షన్స్ రాబట్టుకుంటోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన ఈ సినిమాకి కొరటాల శివ డైరెక్టర్. ప్రస్తుతం చలన చిత్ర పరిశ్రమని పట్టి పీడిస్తున్న భూతం పైరసీ. బాక్స్ ఆఫీసు వద్ద సూపర్ హిట్ గా దూసుకెళ్తున్న ఈ సినిమాకి పైరసీ ఇబ్బంది కూడా ఉంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో మహేష్ అభిమానులు, పోలీసులు కలిసి పైరసీని అడ్డుకున్నారు.

తాజాగా ఈ చిత్ర హీరో మహేష్ బాబు ముందుకు వచ్చి తన అభిమానులకు, సినిమా లవర్స్ కి పైరసీ పై ఓ సూచన ఇచ్చాడు. ‘సినిమా అనేది థియేటర్ లో చూసి ఆస్వాదించాల్సినది. శ్రీమంతుడు సినిమాని సిలవ్ర్ స్క్రీన్ పై మిస్ అవ్వద్దు. నా అన్ని సినిమాలను బిగ్ స్క్రీన్ పైన చూసి ఎంజాయ్ చెయ్యండి. నా అభిమానులకు మరియు సినిమాని ప్రేమించే అభిమానులకు పైరసీని ఎంకరేజ్ చెయ్యద్దని, ఎక్కడన్నా కనిపిస్తే పైరసీని కిల్ చెయ్యండని’ మహేష్ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు పిలుపునిచ్చాడు. మహేష్ బాబు సైనికుడు సినిమా టైం నుంచి ప్రతి సినిమా టైంలోనూ కిల్ పైరసీ గురించి అభిమానులకు స్పెషల్ గా చెప్పి పైరసీని అరికట్టడంలో తన వంతు కృషి చేస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు