ఈ వైవిధ్యమే బన్నీకి విపరీతమైన క్రేజ్, ఫాలోయింగ్ తెస్తోంది

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమాల చేసే వేగం కొద్దిగా తగ్గిందనే చెప్పాలి. 2016 నుండి ఆయన ఏడాదికి ఒక సినిమా మాత్రమే చేస్తూ వస్తున్నారు. ఈ ఆలస్యానికి కారణం లేకపోలేదు. ప్రతి సినిమాకు, ప్రతి పాత్రకు వైవిధ్యం చూపాలని బన్నీ అనుకోవడమే ఈ నెమ్మదితనానికి కారణం. 2015లో వచ్చిన ‘రుద్రమదేవి’లో గోన గన్నారెడ్డి పాత్రలో అలరించిన బన్నీ ఆ తర్వాత చేసిన ప్రతి సినిమాలోనూ ప్రత్యేకత చూపుతూనే ఉన్నారు.

‘సరైనోడు’లో ఫిట్ అండ్ ఫాస్ట్ అన్నట్టు కనిపించిన అల్లు అర్జున్ ‘దువ్వాడ జగన్నాథం’ సినిమాలో పంచెకట్టి తనదైన కామెడీ టైమింగ్ ప్రదర్శించి అలరించారు. అలాగే ఆ తర్వాత చేసిన ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’లో యాంగ్రీ మిలిటరీ ఆఫీసర్ పాత్రలో మెప్పించి ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్న కొత్త చిత్రం ‘అల వైకుంఠపురం’లో ఇంకో కొత్త లుక్ ట్రై చేస్తున్నారు.

ఇప్పటి వరకు విడుదలైన ఫస్ట్ గ్లింప్స్, ఫస్ట్ లుక్ పొస్టర్స్ చూస్తే క్లాస్ లుక్, మాస్ మేనరిజమ్ కలగలిసిన పాత్రలో బన్నీ నటిస్తున్నట్టు అర్థం అవుతోంది. ఈ లుక్ పట్ల అభిమానులు పూర్తి సంతృప్తిగా ఉన్నారు. బన్నీ సినిమాలు ఆలస్యంగా చేసినా ఆయన ఎంచుకుంటున్న కథలు, పాత్రలు అభిమానులకు నచ్చేలా చూసుకుంటున్నాడని కితాబిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే బన్నీ చూపిస్తున్న ఈ వైవిధ్యమే ఆయనకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడేలా చేసిందని అనుకోవచ్చు.

Exit mobile version