యువ సామ్రాట్ నాగ చైతన్య ‘మజిలీ’తో కెరీర్ లో మొదటి సారి బ్లాక్ బ్లాస్టర్ హిట్ కొట్టాడు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం హౌజ్ ఫుల్ కలెక్షన్స్ తో బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతుంది. 3రోజుల్లో ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 17.35 కోట్ల షేర్ ను రాబట్టుకుంది.
ఇక ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 21కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయడంతో మరో రెండు , మూడు రోజుల్లో అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ కానుంది. శివ నిర్వాణ తెరకెక్కించిన ఈ రొమాంటిక్ ఎమోషనల్ డ్రామాలో దివ్యాంశ కౌషిక్ , రావు రమేష్ , పోసాని కృష్ణ మురళి ముఖ్య పాత్రల్లో నటించారు.
ప్రపంచ వ్యాప్తంగా మజిలీ 3 రోజుల కలెక్షన్ల వివరాలు :
| ఏరియా | కలెక్షన్స్ |
| నైజాం | 5.35 కోట్లు |
| వైజాగ్ | 1.94కోట్లు |
| సీడెడ్ | 1.77 కోట్లు |
| గుంటూరు | 1.24 కోట్లు |
| తూర్పు గోదావరి | 0.90కోట్లు |
| పశ్చిమ గోదావరి | 0.64 కోట్లు |
| కృష్ణా | 1.01 కోట్లు |
| నెల్లూరు | 0.40 కోట్లు |
| కర్ణాటక | 1.15 కోట్లు |
| రెస్ట్ అఫ్ ఇండియా | 0.70కోట్లు |
| యూఎస్ఏ | 2.25 కోట్లు |
| మొత్తం 3 రోజులకు గాను షేర్ | 17.35 కోట్లు |
