The Raja Saab: షేక్ చేస్తున్న సాంగ్ పై ట్విస్ట్ ఇచ్చిన మేకర్స్!

The Raja Saab

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ అలాగే రిద్ధి కుమార్ లు హీరోయిన్స్ గా దర్శకుడు మారుతీ తెరకెక్కించిన అవైటెడ్ హారర్ ఫాంటసీ ఎంటర్టైనర్ చిత్రమే “ది రాజా సాబ్”(The Raja Saab). మంచి అంచనాలు నడుమ రిలీజ్ కి వస్తున్న ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇక ఈ సినిమా నుంచి వస్తున్న ప్రతీ ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్ ని రేకెత్తిస్తుంది. ఇలా లేటెస్ట్ గా వచ్చిన స్పెషల్ సాంగ్ ఇంటర్నెట్ ని షేక్ చేస్తుంది. ముగ్గురు హీరోయిన్స్ తో ప్రభాస్ చేసిన నాచో నాచో అనే హిందీ రీమిక్స్ సాంగ్ కి ఇప్పుడు సాలిడ్ రెస్పాన్స్ వస్తుంది. దీనితో ఈ సాంగ్ కేవలం హిందీ, తమిళ్ లో మాత్రమే ఉంటుంది అని కన్ఫర్మ్ చేశారు.

కానీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ ఉంటుందా లేదా అనే దానిపై క్లారిటీ ఇచ్చారు. మన దగ్గర ఈ సాంగ్ కేవలం హిందీలోనే ఉంటుంది అని తెలిపారు. సో ఈ సాంగ్ పై ఫ్యాన్స్ కి ఓ క్లారిటీ వచ్చినట్టే అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహించారు. అలాగే జనవరి 9న పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు.

Exit mobile version