తమిళ స్టార్ హీరో విక్రమ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్న చిత్రం ‘సామీ స్క్వేర్. హరి దర్శకత్వంలో ‘సామి’ చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ చిత్ర విడుదల కోసం రెండు తేదీలను పరిశీలిస్తున్నారు. దాంట్లో మొదటగా ఆగష్టు 31న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఒకవేళ ఆరోజు విడుదల వాయిదా పడితే సెప్టెంబర్ 13 న వినాయక చవితి కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకులముందుకు తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తున్నారు చిత్ర నిర్మాతలు.
కీర్తి సురేష్, ఐశ్వర్య రాజేష్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. బాబీ సింహ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని తమీన్స్ ఫిలిమ్స్ పతాకం ఫై శిబు తమీన్స్ నిర్మిస్తున్నారు.
