“చైతూ 22” పై సాలిడ్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్.!

మన తెలుగు సినిమా దగ్గర ఉన్న యంగ్ అండ్ ఫైనెస్ట్ హీరోస్ లో అక్కినేని నాగ చైతన్య కూడా ఒకడు. ప్రతి సినిమాకి తనని డిఫరెంట్ గా మలుచుకుంటూ వచ్చే చైతు రీసెంట్ గా థాంక్ యూ సినిమాతో పలకరించాడు. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా తర్వాత అయితే తమిళ్ స్టార్ దర్శకుడు వెంకట్ ప్రభు తో తన కెరీర్ లో 22వ సినిమాగా ప్లాన్ చేశారు. మరి ఈ చిత్రంపై అయితే మేకర్స్ సాలిడ్ అప్డేట్ ని అందించారు.

ఒక ఇంట్రెస్టింగ్ పోస్టర్ డిజైన్ చేసి షూటింగ్ అయితే రేపటి నుంచే స్టార్ట్ చేస్తున్నట్టు తెలిపారు. ఇక ఈ పోస్టర్ ని కూడా గమనించినట్టు అయితే ఈ సినిమాలో తాను చేస్తుంది పోలీస్ రోల్ అనే రివీల్ చేశారు. దీనితో అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ పై మరింత ఆసక్తి నెలకొంది. ఇక ఈ సినిమాని బై లాంగువల్ సినిమాగా తెరకెక్కించనుండగా యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు అలాగే శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

Exit mobile version