చరణ్ వర్సెస్ యష్.. ఇంట్రెస్టింగ్ క్లాష్ అవుతుందా?

Yash-vs-Ram-Charan

కన్నడ సినిమా అందించిన ఒక ఊహించని బ్లాక్ బస్టర్ హిట్ చిత్రమే ‘కేజియఫ్’. దర్శకుడు ప్రశాంత్ నీల్, హీరో యష్ ల కోసం పాన్ ఇండియా ఆడియెన్స్ మాట్లాడుకుంది ఆ సినిమా నుంచే. అయితే ఈ సినిమా విడుదల అయ్యినపుడు రాకింగ్ స్టార్ యష్ కి మన టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి పోలికలు ఉన్నాయని చాలామంది కేజియఫ్ హీరో రామ్ చరణా? అని అనుకున్నవారు కూడా ఉన్నారు.

ఇలా ఇద్దరి మధ్య పోలికలు ఇప్పటికీ మాట్లాడుకుంటారు. ఇప్పుడు వరకు ఇద్దరూ సెపరేట్ గా తమ సినిమాలతో బిజీగా ఉన్నారు. కానీ బాక్సాఫీస్ దగ్గర తమ సినిమాలు క్లాష్ కి వచ్చింది లేదు. కానీ మొదటిసారి ఆ అవకాశం కనిపిస్తుంది. యష్ నటించిన అవైటెడ్ సినిమా “టాక్సిక్” ఆల్రెడీ ఈ జూన్ 4కి ఫిక్స్ అయ్యింది. అలానే చరణ్ పెద్ది సినిమా కూడా మేకర్స్ జూన్ రిలీజ్ కి సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు.

ఇందులో ఉన్న పాజిబుల్ డేట్స్ లో జూన్ 4 కూడా ఒకటి. అవును యష్ టాక్సిక్ మేకర్స్ లాక్ చేసిన అదే డేట్ లో పెద్ది కూడా వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఇదే జరిగితే మాత్రం ఒక ఇంట్రెస్టింగ్ క్లాష్ గా పాన్ ఇండియా లెవెల్లో నిలుస్తుంది అని చెప్పొచ్చు. ఒకే లుక్స్ తో ఉండే ఇద్దరు హీరోలు తమ సినిమాలతో బిగ్ స్క్రీన్స్ పై ట్రీట్ ఇవ్వడం అనేది ఒకింత ఆసక్తికర అంశమే.

Exit mobile version