ఉస్తాద్ భగత్ సింగ్ స్ట్రాటజీ.. వాటికి నో చెబుతున్న మేకర్స్..?

ustaad-bhagat-singh

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఉగాది కానుకగా మార్చి 19న గ్రాండ్‌గా విడుదల కానుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ఫైనల్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతుండగా, సంగీత దర్శకుడు థమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌పై ఫోకస్ చేశారు. మరోవైపు, బాలీవుడ్ భారీ చిత్రం ‘ధురందర్: ది రివెంజ్’ మార్చి 18 సాయంత్రం నుండే ప్రీమియర్ షోలతో బాక్సాఫీస్ వద్ద పోటీకి దిగుతోంది.

టికెట్ ధరల విషయంలో చిత్ర యూనిట్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ సినిమాకు తెలంగాణలో ఎలాంటి టికెట్ రేట్ల పెంపు ఉండకపోవచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం రూ.500 ధరతో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన అధికారిక జీవో త్వరలోనే వచ్చే అవకాశం ఉంది. అలాగే, మార్చి 18న ప్రీమియర్స్ కాకుండా, మార్చి 19న ఉదయం 5 గంటలకే ఎర్లీ మార్నింగ్ షోలతో తెలుగు రాష్ట్రాల్లో సందడి మొదలుకానుంది.

హరీష్ శంకర్ దర్శకత్వంలో మాస్ యాక్షన్ కాప్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. భారీ అంచనాల మధ్య విడుదలవుతున్న ఈ సినిమా, బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను తిరగరాస్తుందో చూడాలి.

Exit mobile version