స్టార్ డైరెక్టర్ అకాల మరణం.

sachy

మరో టాలెంటెడ్ డైరెక్టర్ అనారోగ్యం కారణంగా అసువులుబాశారు. మలయాళం దర్శకుడు సాచి నిన్న తుదిశ్వాస విడిచారు. సచ్చిదానందన్ అలియాస్ సాచి వయసు కేవలం 48 ఏళ్ళని తెలుస్తుంది . కొద్దిరోజుల క్రితం సాచికి గుండె పోటు రావడంతో తిరుచూర్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో అడ్మిట్ చేయడం జరిగింది. ఈయన గుండె ఆపరేషన్ కూడా జరుగగా వెంటిలేషన్ పై చికిత్స అందిస్తున్నారు. నిన్న ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మరణించారు.

ఈ ఏడాది విడుదలై భారీ విజయం అందుకున్న అయ్యప్పనుమ్ కోశియమ్ డైరెక్టర్ సాచి కావడం విశేషం.విమర్శలకుల ప్రశంలు దక్కించుకున్న ఈ చిత్రం తెలుగులో కూడా రిమేక్ కానుంది. ఇక 2015లో వచ్చిన అనార్కలి చిత్రంతో డైరెక్టర్ గా మారిన సాచి డ్రైవింగ్ లైసెన్స్,రామ లీల, రన్ బాబీ రన్ చిత్రాలకు స్క్రీన్ ప్లే అందించారు. ఈ ఏడాది ఇప్పటికే సుశాంత్ సింగ్ రాజ్ పుత్, రిషి కపూర్, ఇర్ఫాన్ ఖాన్ మరియు చిరంజీవి సర్జా వంటి ప్రముఖ నటులు అకాల మరణం చెందారు.

Exit mobile version