DV4: ధ్రువ్ విక్రమ్, రమేష్ వర్మ కాంబోలో బైలింగ్వల్ ప్రాజెక్ట్.. అక్టోబర్ నుంచి షూటింగ్ షురూ

కోలీవుడ్ యంగ్ టాలెంట్ ధ్రువ్ విక్రమ్ తన తదుపరి ప్రాజెక్ట్‌ను ఖరారు చేశారు. టాలీవుడ్ దర్శకుడు రమేష్ వర్మతో కలిసి ఆయన ఓ ద్విభాషా చిత్రాన్ని చేయబోతున్నారు. వర్కింగ్ టైటిల్ #DV4గా తెరకెక్కుతున్న ఈ సినిమాను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

​ఈ భారీ ప్రాజెక్ట్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థలు పెన్ మూవీస్, శ్రీ నీలాద్రి ప్రొడక్షన్స్, ఆర్వీ ఫిల్మ్‌హౌస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రముఖ నిర్మాత జయంతిలాల్ గడ సమర్పణలో ఈ సినిమా రానుంది. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రూపొందుతున్న ఈ చిత్రంపై అధికారిక ప్రకటన రావడంతో సినీ ప్రియుల్లో ఆసక్తి మొదలైంది.

​అక్టోబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్

​ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్‌ను ఈ ఏడాది అక్టోబర్‌లోనే మొదలుపెట్టేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. రమేష్ వర్మ మార్క్ కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు ధ్రువ్ విక్రమ్ శైలికి సరిపోయేలా ఓ భారీ కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను మేకర్స్ త్వరలోనే అధికారికంగా వెల్లడించనున్నారు.

Exit mobile version