ఇంట్రెస్టింగ్ గా ’23’ ట్రైలర్..

23 trailer

మన తెలుగు సినిమా దగ్గర మల్లేశం, ఏ ఎం మెట్రో లాంటి అవార్డ్ విన్నింగ్ సినిమాలు తీసిన టాలెంటెడ్ దర్శకుడు రాజ్ ఆర్ తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రమే 23 (ఇరవై మూడు). అయితే ఈ చిత్రం నుంచి మేకర్స్ హార్డ్ హిట్టింగ్ గా సాగే సహజమైన ట్రైలర్ ని ఇపుడు విడుదల చేశారు. పలు నిజ జీవిత సంఘటనలు ఆధారంగా తెరకెక్కించిన సినిమాగా ఇది కనిపిస్తుంది.

మెయిన్ గా దర్శకుడు సహజమైన రా అండ్ రస్టిక్ టేకింగ్ ట్రైలర్ లో గమనించవచ్చు. అమాయకులు ఈ సమాజంలో ఎలా బలైపోతున్నారు? తప్పుడు కేసుల్లో ఇరుక్కొని జైల్లో మగ్గిపోతున్న అమాయకులకు చట్టం ఈ సమాజంలో సమానంగా అందరికీ వర్తిస్తుందా అనే పాయింట్ తో ప్లాన్ చేసిన ఈ సినిమాలో ఒక యువ జంట పడ్డ ఇబ్బందులు ఏంటి అనేవి ట్రైలర్ లో చూపించడం జరిగింది.

అలాగే ఇందులో మ్యూజిక్ ఇంకా సినిమాటోగ్రఫీ కూడా ప్రధాన ఆకర్షణ అని చెప్పవచ్చు. మరి ఈ చిత్రం దర్శకునికి ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి స్టూడియో 99 అలాగే స్పిరిట్ మీడియా వారు నిర్మాణం వహిస్తుండగా ఈ మే 16న థియేటర్స్ లో చిత్రం విడుదల కాబోతుంది.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Exit mobile version