మల్లేశం ఫస్ట్ లుక్ విడుదల !

mallasem1

పద్మ శ్రీ అవార్డు గ్రహీత చేనేత కార్మికుడు చింతకింది మల్లేశం జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘మల్లేశం’. ఇటీవలే ఈ చిత్రం షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ప్రముఖ కమెడియన్ ‘పెళ్లిచూపులు’ఫేమ్ ప్రియదర్శి పులికొండ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తుండగా ఝాన్సీ ముఖ్య పాత్రలో నటిస్తుంది. ఇక తాజాగా ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ ను ఈరోజు విడుదలచేశారు.

రాజ్ ఆర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ అధికారి నిర్మిస్తున్నారు. పేదకుటుంభంలో జన్మించిన మల్లేశం తన తల్లి కష్టం చూడలేక ఆసు యంత్రాన్ని ఎలా తయారు చేయగలిగాడు అనే నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం త్వరలోనే విడుదలకానుంది.

Exit mobile version