వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తో ఈ ఏడాది తన నామ సంవత్సరంగా మార్చుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ మమితా బైజు దాదాపు దక్షిణాదిన అన్ని ఇండస్ట్రీలలో సినిమాలు చేయడం అవి ఒకోకటి భారీ గ్రాసర్ లు గా కూడా నిలిచాయి. ఇక వీటిలో మలయాళ ఇండస్ట్రీ హిట్ సినిమా ‘బెత్లెహోమ్ కుటుంబ యూనిట్’ కూడా ఒకటి. ప్రేమమ్ హీరో నివిన్ పౌలి హీరోగా దర్శకుడు గిరీష్ తెరకెక్కించిన ఈ రోమ్ కామ్ డ్రామా అక్కడ 300 కోట్లకి పైగా రాబట్టి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.
మాసివ్ లాంగ్ రన్ తర్వాత ఇక ఫైనల్ గా ఓటీటీలో విడుదలకి ఫిక్స్ అయ్యింది. ఈ సినిమాని జియో హాట్ స్టార్ వారు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అందులో రూమర్స్ గా వినిపించిన డేట్ అక్టోబర్ 2 నుంచే పాన్ ఇండియా భాషల్లో విడుదల చేస్తున్నట్టు హాట్ స్టార్ వారు కన్ఫర్మ్ చేశారు. సో అప్పుడు మిస్ అయ్యిన వారు ఉంటే ఇప్పుడు గాంధీ జయంతి హాలిడేలో చూడొచ్చు.
The film Kerala fell in love with. ❤️
Now, it’s coming home.Bethlehem Kudumba Unit, streaming from October 2 on JioHotstar.@NivinOfficial @MamithaBaiju_ @BhavanaStudios @iDileeshPothan @BhavanaRelease @PharsFilm @PicturesPVR @MythriRelease @FutureRunup @PrimarkProd… pic.twitter.com/Qn4V7CxfjC
— JioHotstar Malayalam (@JioHotstarMal) September 27, 2026


