‘డ్రాగన్’ దర్శకునికి మ్యాన్ ఆఫ్ మాసెస్ స్పెషల్ విషెస్..

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా రుక్మిణి వసంత్ హీరోయిన్ గా సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో చేస్తున్న అవైటెడ్ చిత్రమే “డ్రాగన్”. భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ ఇంటర్నేషనల్ లెవెల్ ఉన్న స్కేల్ సినిమాని దర్శకుడు ప్రశాంత్ నీల్ బిగ్గెస్ట్ విజన్ తో తెరకెక్కిస్తున్నాడు.

అయితే నేడు నీల్ బర్త్ డే కావడంతో చిత్ర యూనిట్ సహా ఎన్టీఆర్ కూడా తన దర్శకునికి తన స్పెషల్ విషెస్ ని అందించారు. హ్యాపీ బర్త్ డే డైరెక్టర్ అవరే.. మీరు చెప్పే కథల్లానే ఈ ఏడాది కూడా ఎంతో గ్రాండ్ గా జరగాలని అలానే మన కలయికలో రాబోతున్న ఫ్యూచర్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నాను అని తారక్ డ్రాగన్ సెట్స్ నుంచి నీల్ ఫోటో ని షేర్ చేసి పోస్ట్ చేసాడు. దీనితో తన సూపర్ స్పెషల్ విషెస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Exit mobile version