మెగా విక్టరీల బాక్సాఫీస్ విధ్వంసం.. 3 రోజుల్లో వరల్డ్ వైడ్ ఎంతంటే!

Mana Shankara Vara Prasad Garu

ఈ సంక్రాంతి కానుకగా థియేటర్స్ లోకి వచ్చిన తెలుగు చిత్రాల్లో దర్శకుడు మెగాస్టార్ చిరంజీవి అలాగే వెంకీ మామ కలయికలో దర్శకుడు అనీల్ రావిపూడి తెరకెక్కించిన సాలిడ్ ఎంటర్టైనర్ చిత్రం “మన శంకర వరప్రసాద్ గారు”(Mana Shankara Vara Prasad Garu). భారీ అంచనాలు సెట్ చేసుకొని వచ్చిన ఫ్యామిలీ ఆడియెన్స్ ఇంకా సీనియర్ మెగా ఫ్యాన్స్ కి మళ్ళీ పూనకాలు అందించింది.

ఇలా థియేటర్స్ లో ఓ రేంజ్ లో ఎంజాయ్ చేస్తున్న ఈ సినిమా భారీ వసూళ్లు కొల్లగొడుతుంది. ఇలా మొత్తం మూడు రోజుల రన్ ని కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు ఏకంగా 150 కోట్ల గ్రాస్ క్లబ్ లోకి చేరిపోయింది. దీనితో ఈ సినిమా హవా ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. మేకర్స్ ఈ సినిమా మూడు రోజుల్లో 152 కోట్ల గ్రాస్ ని సొంతం చేసుకున్నట్టు కన్ఫర్మ్ చేశారు.

ఇక నేడు సంక్రాంతి హాలిడే మరింత ప్లస్ కానుంది అని చెప్పొచ్చు. దీనితో ఈ వారాంతానికి ఈ సినిమా ఈజీగా 250 కోట్ల గ్రాస్ దాటినా ఎలాంటి ఆశ్చర్యం లేదు. ఇక ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటించగా సాహు గారపాటి, సుష్మిత కొణిదెలలు నిర్మాణం వహించారు.

Exit mobile version