సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’(Mana Shankara Vara Prasad Garu) బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట కొనసాగిస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ‘మెగా సంక్రాంతి బ్లాక్ బస్టర్’గా నిలిచింది. ఇక ఈ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర కళ్లుచెదిరే కలెక్షన్స్ వస్తుండటంతో ఈ సినిమా పలు రికార్డులు క్రియేట్ చేస్తుంది.
ఈ చిత్రం కేవలం ఓవర్సీస్ మొత్తంలో ఏకంగా 4.2 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లను సాధించినట్లు మేకర్స్ వెల్లడించారు. దీంతో మెగాస్టార్ స్టామినా ఏమిటో మరోసారి ప్రూవ్ అయింది. ఈ సినిమా బాక్సాఫీస్ ప్రయాణం ఇక్కడితో ఆగడం లేదు. ప్రస్తుతం ఉన్న జోరు చూస్తుంటే త్వరలోనే ఓవర్సీస్ మార్కెట్‌లో 5 మిలియన్ డాలర్ల మార్కును చేరుకునే దిశగా దూసుకుపోతోంది.
సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మించిన ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందించారు. విదేశాల్లోని తెలుగు ప్రేక్షకులు చిరంజీవి నటనకు, అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్టైన్మెంట్ కు బ్రహ్మరథం పడుతున్నారు.
