బుకింగ్స్ లో అదరగొడుతున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’

Mana Shankara Vara Prasad Garu

మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు అనీల్ రావిపూడి కాంబినేషన్ లో చేసిన లేటెస్ట్ చిత్రమే “మన శంకర వరప్రసాద్ గారు”(Mana Shankara Vara Prasad Garu). ఫ్యామిలీ ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమా ఇవాళ ప్రీమియర్స్ తో ప్రపంచ వ్యాప్తంగా షోస్ పడనున్నాయి. ఇక ఈ సంక్రాంతి బరిలో వస్తున్న ఈ సినిమా ఇంకా షోస్ పడకముందే సాలిడ్ బుకింగ్స్ ని నమోదు చేస్తుంది.

దీనితో మన శంకర వరప్రసాద్ గారు బుక్ మై షో యాప్ లో ఆల్రెడీ 2 లక్షలకి పైగా టికెట్స్ ని సేల్ చేసుకున్నట్టు మేకర్స్ చెబుతున్నారు. దీనితో ఈ సినిమా పట్ల ఆడియెన్స్ ఎలా ఆసక్తిగా ఉన్నారో అర్ధం చేసుకోవచ్చు. ఇక రేపు థియేటర్స్ లో షోస్ పడ్డాక టాక్ కరెక్ట్ గా వస్తే మాత్రం సంక్రాంతి బరిలో భారీ వసూళ్లు ఈ సినిమా సొంతం చేసుకుంటుంది అని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రానికి భీమ్స్ సంగీతం అందించగా నయనతార హీరోయిన్ గా నటించింది. అలాగే వెంకీ మామ గెస్ట్ రోల్ చేశారు. ఇక ఈ చిత్రానికి సాహు గారపాటి నిర్మాణం వహించారు.

Exit mobile version