
టాలీవుడ్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ‘మనం’ సినిమా తమిళంలో అనువాదం కానుంది.ఇక్కడ వినిపిస్తున్న పుకారు ప్రకారం ఈ సినిమాలో ఏ.ఎన్.ఆర్ పాత్రని కమల్ హాసన్ ని చేయమని కోరారట. నాగార్జున పాత్రను మాధవన్ పోషిస్తాడట.
కమల్ కి మనం సినిమా, ఏ.ఎన్.ఆర్ పాత్ర నచ్చింది అని చెప్పారు గానీ దానికి మించి ఎటువంటి వార్తా తెలుపలేదు
తెలుగు సినిమాలు తమిళంలోకి అనువదించిన తరువాత విజయం సాధించినవి చాలా అరుదు. రాజమౌళి ఈగ సినిమా తమిళ ప్రేక్షకుల మన్ననలను పొందింది. మరి తమిళంలో ఈ మనం ఎన్ని రికార్డులను తిరగరాస్తుందో చూడాలి