
ఏ.ఎన్.ఆర్, నాగార్జున, నాగ చైతన్య కలసి నటించిన ‘మనం’ కొన్ని రోజులుగా వార్తల్లో నటిస్తుంది. విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సమంత, శ్రియ శరన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. నాగార్జున కుటుంభం నిర్మించిన ఈ చిత్రంలో అక్కినేని కుటుంబంలోని మూడుతరాల నటులు మొదటిసారిగా కలసి నటించారు.
ఈ రోజు విడుదల అయిన ‘మనం’ ఆడియోలోని చాలా పాటలకి సంగీతప్రియుల నుంచి మంచి స్పందన లభిస్తుంది. దీనికి తోడు ఈ ఆడియోలో పెద్దహిట్ గా నిలిచే ‘చిన్ని చిన్ని ఆశలు’ అనే పాట చిత్రీకరిస్తునప్పుడు తీసిన వీడియో రిలీజ్ చేసారు. శ్రేయ గోశల్ పాడిన ఈ పాటలో నాగార్జున శ్రియ శరన్ నటించారు.
అనుప్ రుబెన్స్ ఈ చిత్ర పాటల గురుంచి చెప్తూ తన కెరీర్ లోనే గుర్తుండిపోయే సినిమా ‘మనం’ అని తెలిపారు. పి.ఎస్.వినొద్ ఛాయాగ్రహణం అందించిన ఈ చిత్రం మే 23 న విడుదల కానుంది