
మంచు ఫ్యామిలీ వారసుడిగా పరిచయం అయిన మంచు మనోజ్ మొదటి నుంచి తనదైన ముద్ర వేసుకుంటూ డిఫరెంట్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తున్నాడు. పెళ్లి తర్వాత కాస్త మనోజ్ ప్రస్తుతం చకచకా తన సినిమాలను ఫినిష్ చేస్తూ, బ్యాక్ టు బ్యాక్ తన సినిమాలను రిలీజ్ చేయడానికి సిద్దం అవుతున్నాడు. రామ్ గోపాల్ వర్మ – మనోజ్ కాంబినేషన్ లో రూపొందిన ఇంటెన్స్ యాక్షన్ డ్రామా ‘ఎటాక్’. చాలా రోజుల క్రితమే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాని డిసెంబర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
ఇది కాకుండా డీసెంట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ చేసే దశరథ్ తో కలిసి మంచు మంచి చేస్తున్న లవ్ థ్రిల్లర్ ‘శౌర్య’. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. డిసెంబర్ 10కల్లా ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి కానుంది. దాంతో ఈ చిత్ర టీం డిసెంబర్ చివరిలోపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ని ఫినిష్ చేసేసి జనవరిలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. దీని ప్రకారం మనోజ్ డిసెంబర్ లో ఒక సినిమాతో, జనవరిలో ఒక సినిమాతో ప్రేక్షకులను మెప్పించడానికి సిద్దం చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు కూడా ఒకదానితో ఒకటి సంబంధం లేనివి కావడం విశేషం.

