భారీ స్థాయిలో మంచు విష్ణు కొత్త సినిమా..!

manchu-vishnu
ఈ రోజు మంచి అంచనాల మధ్య విడుదలైన ’ఈడో రకం ఆడో రకం’ సినిమా కి మంచి టాక్ రావడంతో విష్ణు తన తరువాత సినిమా పైన దృష్టి సారించాడు. ’ఈడో రకం ఆడో రకం’ ప్రమోషన్స్ లో పాల్గొన్న విష్ణు తను తర్వాత చేయబోయే సినిమా ‘కన్నప్ప’ గా ప్రకటించాడు.

శివభక్తుని గా చరిత్రల్లో నిలిచిపోయిన కన్నప్ప కథను ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ళ భరణి సిద్ధం చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో భారీ స్థాయిలో విజువల్ ఎఫెక్ట్స్ ఉంటాయని తెలుస్తున్నది. అంతేకాకుండా తనకున్న మార్కెట్ కంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువగా ఈ సినిమా నిర్మించడానికి వెచ్చిస్తున్నట్లు విష్ణు చెప్పాడు. ఈ సినిమా గురించి మరింత సమాచారం త్వరలో తెలుస్తుంది.

Exit mobile version