రాజమౌళి డైరెక్షన్ లో మంచు లక్ష్మీ డ్రీం రోల్.!

Manchu-Lakshmi
ఏంటి.. మంచు వారమ్మాయి మంచు లక్ష్మీ తన డ్రీం రోల్ ని టాలీవుడ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో చేయనుందా.. ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలవుతుందా అనే ప్రషణలు అప్పుడే మీ బ్రెయిన్ లో మొదలయ్యయా.. వాటిని కాసేపు కంట్రోల్ చేసుకొండి, అసలు విషయం మేము చెబుతాం.. మంచు లక్ష్మీ లీడ్ రోల్ చేసిన సినిమా ‘దొంగాట’. ఈ సినిమా మే 1న రిలీజ్ కానుండడంతో ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి.

ఈ ప్రమోషన్స్ లో భాగంగా మంచు లక్ష్మీ ఇచ్చిన ఓ స్పెషల్ ఇంటర్వ్యూలో మీ డ్రీం రోల్ ఏంటి, ఎవరి డైరెక్షన్ లో చేయాలనీ అనుకుంటున్నారు అని అడిగితే ‘ నాకు ఎప్పటి నుంచో ఉన్న డ్రీం ఝాన్సీ లక్ష్మీ భాయ్ పాత్ర చేయాలి, అది కూడా ఎస్ఎస్ రాజమౌళి గారి డైరెక్షన్ లో చేయాలని ఉందని’ లక్ష్మీ మంచు తన మనసులోని మాటని బయట పెట్టింది. అలాగే తెలుగు కాకుండా మలయాళంలో సినిమాలు చేయాలని ఉండనే కోరికని బయట పెట్టింది. ప్రస్తుతం రాజమౌళి కూడా పీరియాడికల్ ఫిల్మ్ అయిన బాహుబలి ని ఫినిష్ చేసే పనిలో ఉన్నాడు. మరి మంచు లక్ష్మీ కోరికని మన్నించి ఝాన్సీ లక్ష్మీ భాయ్ సినిమా చేస్తాడా లేదా అన్నది కాలమే నిర్ణయించాలి.

Exit mobile version