మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ‘పెద్ది’ సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. దర్శకుడు బుచ్చిబాబు సానా డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాతో చరణ్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సక్సెస్ అందుకుంటాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్ర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అభిమానులు ఆతృతగా చూస్తున్నారు.
అయితే, రామ్ చరణ్ ఓ కేమియో పాత్రలో కనిపిస్తాడు అనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. హీరో మంచు మనోజ్ ‘భైరవం’ సినిమాతో సాలిడ్ కమ్ బ్యాక్ ఇచ్చేందుకు ప్రయత్నించాడు. ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆడలేదు. ఇక ఆ తర్వాత ‘మిరాయ్’ చిత్రంలో విలన్‌గా అదిరిపోయే హిట్ అందుకున్నాడు మనోజ్. అయితే, ఇప్పుడు మరోసారి హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అయ్యాడు. ‘డేవిడ్ రెడ్డి’ అనే పీరియాడిక్ చిత్రంలో మనోజ్ హీరోగా నటిస్తున్నాడు.
కాగా, ఈ సినిమాలో ఓ పవర్‌ఫుల్ కేమియో పాత్ర ఉందని.. దానికోసం చరణ్‌ను అప్రోచ్ అయ్యారట మేకర్స్. మరి పెద్ది బిజీలో ఉన్న చరణ్, మనోజ్ కోసం కేమియో రోల్ చేస్తాడా..? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
