నిరంజన్, గ్రీష్మ నేత్రికా, ప్రియ జస్పర్, దీప్తి శ్రీరంగం ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సరికొత్త హారర్ కామెడీ చిత్రం “రుక్మిణి”. జి సినిమా బ్యానర్‌పై సింహాచలం గుడుపూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్‌ను టాలీవుడ్ హీరో, రాకింగ్ స్టార్ మంచు మనోజ్ చేతుల మీదుగా విడుదల చేశారు.
ఈ సందర్భంగా మంచు మనోజ్ మాట్లాడుతూ.. టీజర్ అద్భుతంగా ఉందని, హీరోగా పరిచయమవుతున్న నిరంజన్‌తో పాటు చిత్ర బృందానికి ఈ సినిమా మంచి విజయాన్ని అందించాలని ఆకాంక్షించారు. టీజర్‌ను విడుదల చేసి, తమను ప్రోత్సహించినందుకు హీరో, హీరోయిన్లతో పాటు ఇతర నటీనటులు మనోజ్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. భయపెడుతూనే కడుపుబ్బా నవ్వించే డిఫరెంట్ కథాంశంతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోందని వారు పేర్కొన్నారు.
నేలబల్లి సుబ్రహ్మణ్యం రెడ్డి, కట్టా గంగాధర రావులు ఈ చిత్రాన్ని ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారని దర్శకుడు సింహాచలం తెలిపారు. సుభాష్ ఆనంద్ సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని మేకర్స్ ధీమా వ్యక్తం చేశారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి, ఈ చిత్రాన్ని త్వరలోనే థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
