
వివాహం తరువాత మంచు మనోజ్ తిరిగి టాలీవుడ్ లో తన సినిమా పనులలో బిజీగా వున్నాడు. తన తదుపరి ప్రాజెక్ట్ ‘సిద్ధూ ఫ్రమ్ శ్రీకాకుళం’ దర్శకుడు జి.ఈశ్వర్ చేతిలో పెట్టాడు. ఈరోజు ప్రారంభమైన ఈ చిత్రానికి జస్వంత్ నిర్మాత. జ్యోత్స్న ఫిలిమ్స్ బ్యానర్ సంస్థలో వచ్చే నెల రెండవ వారం నుండి షూటింగ్ ప్రారంభంకానుంది.
ఈ చిత్రంలో ముఖ్యభాగాన్ని దుబాయ్ లో చిత్రీకరించనున్నారు. ఈ సినిమాలో మనోజ్ సరసన ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నారు. బ్రహ్మానందం ముఖ్యపాత్ర పోషించనున్నాడు. ఈ ప్రాజెక్ట్ కి సంభందించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తారు.